మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. గత శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశానికి సరికొత్త సవాల్ గా బ్లాక్ ఫంగస్ అవతరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. . నొప్పులు, కళ్లు, ముక్కు చూట్టూ ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా ఉంటాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement