Thursday, November 21, 2024

బాంబుల మోతే మంగళ వాయిద్యాలు.. క్షిపణి దాడులే ఆశీర్వాదాలు.. ఉక్రెయిన్‌లో పెళ్లితో ఒక్కటైన జంట

ఓ వైపు భీకర యుద్ధం జరుగుతుంది.. ప్రపంచమంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నది.. బాంబుల వర్షం కురుస్తోంది.. వైమానిక దాడుల సైరన్ల మోత మధ్యే పెళ్లి ప్రమాణాలతో ఓ జంట ఒక్కటైంది. అంతా బాగుంటే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావించారు. యుద్ధం ప్రారంభమైన రోజే పెళ్లి చేసుకోవాలని జంట నిర్ణయించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ప్రశాంతమైన నది పక్కన.. అందమైన లైట్లతో రెస్టారెంట్‌ టెర్రస్‌పై ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

రష్యాలోని వాల్డై హిల్స్‌లో 21 ఏళ్ల యారీనా అరివా, ఆమె భాగస్వామి స్వ్యటో స్లావ్‌ ఫర్సిన్‌ వివాహం చేసుకోవాలని భావించింది. రింగులు మార్చుకుని జంట ఒక్కటైంది. యువతి అరీవా.. కీవ్‌లోని సిటీ కౌన్సిల్‌లో డిప్యూటీగా పని చేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement