తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మరణానంతరం ఆశీర్వాద ఖర్చులకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. పీఆర్సీ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగికి మరణాంతరం అంత్యక్రియలకు ఇచ్చే నగదు సహాయాన్ని రూ.20,000 నుంచి రూ.30,000 వేలకు పెంచింది.
ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.