రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవ్వాల (శుక్రవారం) ఆయన షిర్డీకి వచ్చి సాయిబాబాని దర్శించుకున్నారు. బాబా దీవెనలు కావాలని వేడుకున్నారు. తొలుత సాయి సమాధి వద్దకు వెళ్లి ఆయన పూజలు చేశారు. ఆ తర్వాత షిర్డీ పంఢరీపూర్లో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, సీఎం గెహ్లోట్తో పాటు మాజీ రెవెన్యూ మంత్రి, ఎమ్మెల్యే బాలాసాహెబ్ థోరట్ తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement