తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు (శుక్రవారం) ఆదిలాబాద్లో 43.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా నాంపల్లిలో 43 డిగ్రీలు, గద్వాలలో 42.8 డిగ్రీలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దనోరాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తెలిపింది.
రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2 తేదీల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటోతేదీన కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.