12 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో ఘటన
విచారణకు ఆదేశించిన కేంద్రం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియాలోని ఎఫ్6 సెక్షన్‌లో నేటి ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, దాదాపు డజను మంది ఉద్యోగులకు కాలిన గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాంబు నింపే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఫ్యాక్టరీలోని ఎఫ్-6 విభాగంలో బాంబు నింపే పని జరుగుతుండగా.. ఒక్కసారిగా హైడ్రాలిక్ సిస్టమ్ పేలింది.
పేలుడు శబ్దం చాలా పెద్దగా వినపడింది. దాని శబ్దం ఐదు కిలోమీటర్ల వరకు వినబడింది. ఘటనానంతరం, గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్రంగా గాయపడిన రణధీర్, శ్యామ్‌లాల్, చందన్ లను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక పేలుడు ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యమే కారణమన్న దానిపై కేంద్ర ప్రభుత్వం విచారణ కు ఆదేశించింది…