Thursday, November 21, 2024

Black Tuesday – భారీగాస్టాక్ మార్కెట్ ప‌త‌నం – ‘బేర్’మ‌న్న మ‌దుప‌రులు

ముంబ‌యి – దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా పతనం అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నేటి ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80, 220 దగ్గర ముగియగా.. నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24, 472 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర ముగిసింది.

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ భారీ నష్టాల్లో కొనసాగగా.. ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.

ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియాల్టీ, టెలికాం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌లతో అన్ని రంగాల సూచీలు 2-3 శాతం నష్టాల్లో ముగిశాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement