Friday, September 20, 2024

Black Monday … ఒక్క రోజే రూ.22లక్షల కోట్ల సంప‌ద ఆవిరి

భారీగా కుంగిన స్టాక్ మార్కెట్
బడా కంపెనీలు బేర్ బేర్
సెన్సెక్స్ 2222 పాయింట్లు ..
నిప్ట్ 662 పాయింట్లు లాస్
అమెరికా మాంద్యం..
తూర్పు ఆసియాలో వార్ వార్నింగ్
రూ.83.80లతో కనిష్టానికి రూపాయి

( ఆంధ్రప్రభ స్మార్ట్, ముంబై ప్రతినిధి) అమెరికా ఆర్థిక మాంద్యం తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు .. భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రప్రభావం చూపించాయి. సోమవారం షేర్లు బేర్ మనటంతో.. బ్లాక్ మండే గొల్లుమంది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బావురుమంది. పర్యవసానంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కుంగిపోయాయి. దాదాపు రూ.22 లక్షల సంపద ఆవిరైంది. ఆరంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు తీవ్ర నష్టాలను నమోదు చేశాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,533.11 పాయింట్లు పతనమై 79,448.84 వద్ద, నిఫ్టీ 463.50 పాయింట్లు నష్టపోయి 24,254.20 వద్ద ట్రేడ్ కాగా… మధ్యాహ్నం 1.30 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2543 పాయింట్లు నష్టపోయి 78,439 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 765 పాయింట్లు కోల్పోయి 23,952 వద్ద ట్రేడ్ అయింది..ఇక మార్కెట్ ముగిసే స‌మ‌యానికి 2222 పాయింట్లు సెన్సెక్స్ నష్ట‌పోగా, నిఫ్టి 662 పాయింట్లు లాప్ అయింది..

- Advertisement -

కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. జులై నెలలో అమెరికాలో ఉద్యోగాల వృద్ధి ఊహించిన దాని కంటే చాలా అధికంగా మందగించింది. దీంతో ఆర్థిక మందగమనం తప్పదనే భయాలు మరింత పెరిగాయి. ఈ ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై పడవచ్చనే విశ్లేషణలు గ్లోబల్ మార్కెట్లను కుంగదీశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మరోవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్, హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి

బడా కంపెనీల్నీ బేర్..

రికార్డు స్థాయిలో కొన్ని వారాల పాటు లాభాల బాటలో పయనించిన మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ స్టాక్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌పై టాటా మోటార్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్. సెన్సెక్స్‌-30 సూచీలో సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉండడం గమనార్హం. టైటన్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.కాగా సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి

అంతర్జాతీయ మార్కెట్లల్లోనూ..

మాంద్యం భయాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ ఏకంగా 7 శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన సూచీల పరిస్థితి సైతం అలాగే ఉంది.
కనిష్టానికి రూపాయి

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్గా ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.80 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.08 డాలర్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement