Tuesday, November 19, 2024

బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం

కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌‌లో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడిన వారికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం-2020 కింద దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్‌ ఫంగస్, కరోనాలకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement