గతంలో వైద్యులు చెప్పిన మేరకు కరోనా వచ్చి తగ్గిపోయిన డయాబెటిస్ పేషెంట్లలోనే బ్లాక్ ఫంగస్ బయటపడుతుందని విన్నాం. కానీ తాజా కరోనా రాని వారికి కూడా బ్లాక్ ఫంగస్ వస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ అయితే, ఆ వ్యక్తిలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయి బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతుంది. అంటే కరోనా వైరస్ సోకకుండా బ్లాక్ ఫంగ్‌స్ బారినపడటం అత్యంత అరుదు అని స్పష్టమవుతోంది.
కానీ కరోనా సెకండ్ వేవ్ నడిచిన మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్‌లో 3,471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. అందులో 477 మందికి అసలు కరోనా వైరసే సోకలేదని వెల్లడైంది. అంటే మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 14 శాతం కేసులకు కరోనా హిస్టరీ లేదన్నమాట. దాంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంలో సమగ్ర అధ్యయనం జరగాల్సి అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెద్ద మనసు