Thursday, November 21, 2024

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ సూపర్: ముకేష్‌ అంబానీ

ప్ర‌భ‌న్యూస్ : డేటా, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకమని ముకేష్‌ అంబానీ అన్నారు. భారత్‌తోపాటు ప్రతి దేశానికీ ఎంతో అవసరమన్నారు. అంతర్జాతీయంగా ప్రామాణికం అవసరమని, తద్వారా క్రాస్‌ బోర్డర్‌ లావాదేవీలు, సహాకారాలు, భాగస్వామ్యాలకు అవకాశం దక్కదని అన్నారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అయితే బ్లాక్‌ చెయిన్‌టెక్నాలజీ, క్రిఎ్టో కరెన్సీలు వేరేరు అన్నారు. నమ్మకం ఆధారిత, సమ సమాజానికి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ చాలా కీలకమైనదని ముకేష్‌ అంబానీ వ్యాఖ్యానించారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి లావాదేవీలకైనా అసాధారణ భద్రత, నమ్మకం, ఆటోమేషన్‌, సామర్థ్యాన్ని అందించవచ్చన్నారు. సప్లయి చెయిన్స్‌ ఆధునీకరించవచ్చనని పేర్కొన్నారు. ప్రధాన డిజిటల్‌ సొసైటీగా మారడంలో భారత్‌ సరైన మార్గంలో సాగుతోందని ముకేస్‌ అంబానీ అభిలాషించారు.

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగివుందన్నారు. డేటా వాస్తవానికి ఒక తైలం. సాంప్రదాయక పాత ఆయిల్‌ పోల్చితే కొత్త తైలం ప్రత్యేకమైనవి. సాంప్రదాయక ఆయిల్‌ను కొన్ని ప్రాంతాల నుంచి వెలికితీస్తారు. కాబట్టి కొన్ని దేశాల్లో మాత్రమే సంపద పోగుపడుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా డేటాగా పేర్కొంటున్న కొత్త తైలం ప్రతి చోటా సృష్టించవచ్చు, ప్రతి ఒక్కరూ వినియోగించవచ్చు అని చెప్పారు. దేశం పూర్తిగా 2జీ నుంచి 4జీ వైపు మారుతోంది. ఈ సమాన స్థాయిలో సరసమైన ధరలకే మార్పుల ప్రక్రియ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఫైబర్‌, క్లౌడ్‌, డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వేగంగా అందిపుచ్చుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇంటర్నేషనల్‌ ఫైనాన్సియల్‌ సరీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ముకేష్‌ అంబానీ మాట్లాడారు. ఆధార్‌ కార్డు ద్వారా డిజిటల్‌ ఐడెంటిటీ, డిజిటల్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌, డిజిటల్‌ పేమెంట్ల రూపంలో భారత్‌ ఇప్పటికే గొప్ప డిజిటల్‌ విధానాలను కలిగివుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement