Friday, November 22, 2024

Delhi | తెలంగాణ ఎన్నికలపై బీజేపీ దృష్టి.. ముఖ్య నేతలతో కేంద్ర కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాబోయే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో 26 మంది ముఖ్యనేతలతో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తమిళనాడు నేతలకు అధిష్టానం కమిటీలో చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డికి కేంద్ర కమిటీలో చోటు దక్కింది.

- Advertisement -

కమిటీలో ఉన్న 26  మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులు. ఎన్నికల ప్రచారం, అభ్యర్థులకు తోడ్పాటు, జాతీయ నేతల బహిరంగ సభల నిర్వహణ తదితర బాధ్యతలు ఈ కమిటీకి అప్పగించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంటే డిసెంబర్ మొదటి వారం వరకు అక్కడే ఉండి రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని బీజేపీ హైకమాండ్ వారికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేలా కేంద్ర కమిటీ చురుగ్గా పని చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కార్యాలయం నుంచి గురువారం కేంద్ర కమిటీకి సూచనలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement