Friday, November 22, 2024

TS | తెలంగాణకు కమలం దండు.. టార్గెట్‌ 90 దిశగా రోడ్‌మ్యాప్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు రెడీ అవడంతో ఇక ప్రచారంలో బీజేపీ మరింత స్పీడ్‌ పెంచాలని భావిస్తోంది. ఈక్రమంలోనే తెలంగాణలో కమలం దండును దింపాలని అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన ఒకట్రెండు రోజుల తర్వాత ఢిల్లి నుంచి బీజేపీ అగ్రనేతలైన మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తెలంగాణకు రానున్నారు. ప్రతీ నేత ఒకటి నుంచి మూడేసి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

వీరితో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగ సభలను నిర్వహించేందుకు ఈమేరకు బీజేపీ ప్లాన్‌ చేయబోతోంది. ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో స్పీడ్‌ పెంచేందుకు కమలం దండును దించబోతోంది. రోడ్‌ షోలు, సభలు, సమావేశాలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ను మరింత పెంచి ఓటర్లను తమ వైపు తిప్పుకొని దాన్ని గెలుపు అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తోంది.

- Advertisement -

పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్‌ నింపేలా ప్రచార పర్వాన్ని మరోస్థాయికి తీసుకుపోవాలని బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత వరుసగా నియోజకవర్గాల సభల్లో పాల్గొంటున్నారు. రోజుకు ఒకట్రెండు బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేటీఆర్‌, హరీష్‌ రావు కూడా ఆయా నియోజకవర్గాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో ఇప్పటికే పాల్గొన్నారు. అలాగే బీజేపీ కూడా ఇప్పటికే తమ నేతలను ప్రచారంలో దింపింది.

ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా పలువురు కేంద్రమంత్రులు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లారు. శుక్రవారం దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమం, హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో బతుకమ్మ వేడుకల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. అలాగే ఈనెల 27న రాష్ట్రానికి అమిత్‌ షా, 28న అస్సాం హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలో పర్యటించేలా బీజేపీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. మరోవైపు ఈ నెల 31న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

దీనికితోడూ అసెంబ్లిd ఎన్నికల ప్రచారం ముగిసేలోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ అసెంబ్లిd ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా బీజేపీ రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్లు తెలిసింది. వీలైతే అగ్రనేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాలో లేదా హైదరాబాద్‌లో రోడ్‌ షో లేదా బస్సు యాత్రలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాల్లో 90 అసెంబ్లిd సీట్లను తమ టార్గెట్‌గా ఫిక్స్‌ చేసుకొని ఎన్నికల బరిలో గెలవాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement