Tuesday, November 26, 2024

యూపీలో బీజేపీకి ఒక్క సీటూ రాదు: అఖిలేష్ యాద‌వ్‌

లక్నో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీకి ఒక్క సీటుకూడా రాకపోవచ్చని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఆర్ ఎల్ డీ అధినేత జజయంత్ చౌధరితో పొత్తు చర్చలు ఫలప్రదమైన తరువాత ఆయనతో కలసి ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో నాలుగైదు పార్టీలతో కూటమిగా పోటీలో ఉంటామని, 403 శాసనసభ స్థానాలలో 312 తామే గెలుచుకుంటామని, మా లెక్కల ప్రకారం బీజేపీకి ఒక్క స్థానమూ దక్కే అవకాశం లేదని జోస్యం చెప్పారు.

పశ్చిమ యూపీలో ఆర్ ఎల్ డీతో కలసి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పారు. పాత సంప్రదాయం ప్రకారం రోడ్డుపై కొబ్బరికాయ కొడితే అదే ముక్కలయ్యేదని, కానీ తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొబ్బరికాయ నేలకేసి కొడితే నేలే బద్దలవుతుందంటూ తమ కూటమి ఎంత బలమైనదో చెప్పుకొచ్చారు. హిందూత్వ నినాదం తో బరిలోకి బీజేపీ దిగుతుందని, కానీ ఈసారి ఆ మంత్రం పనిచేయదని, నిరుద్యోగం, అభిృద్ధి వంటి విషయాల్లో యోగి ప్రభుత్వం మాటతప్పిందని జయంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement