Saturday, November 23, 2024

తెలంగాణలో వచ్చేది బీజేపీనే : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడను వదిలించుకునేందుకు మీరంతా భాగస్వాములు అయ్యారు అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
డా కే లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగి పోయారు.. ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నాం అన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంద‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కు భజనపరులుగా మారారు అని మండిప‌డ్డారు. VRA , విద్యార్థులు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు అన్నారు.

అన్ని ప్రాంతీయ, అవినీతి పార్టీల కూటమితో కేసీఆర్ ఏకమయ్యాడు.. గుంపులుగా వచ్చినా… మోడీ సింగిల్ గానే వస్తాడు అన్నారు. రాజస్థాన్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. 2/3 మెజారిటీతో బీజేపీ గెలుస్తుంద‌న్నారు. రాజస్థాన్ లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి… రైతు రుణమాఫీ చేయలేదు, రాహుల్ ది భారత్ జోడో యాత్ర కాదు… కాంగ్రెస్ చోడో యాత్ర చేప‌ట్టార‌న్నారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో మూలాలు తెలంగాణ లో తేలుతున్నాయ‌ని, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాడ‌న్నారు. కేసీఆర్ ఇప్పుడు అపర కుబేరుడు గా మారాడు, తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కు ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? అని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ పేరుకు మాత్రమే రాజధాని, వర్షం వస్తే… మొత్తం మునిగిపోతుంది అన్నారు. హైదరాబాద్ వాసులు కట్టే పన్నులతో ఎంఐఎం వాళ్లకు మాఫీ చేస్తున్నారు.. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదు అని మండిప‌డ్డారు. బీజేపీ దెబ్బకే… సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ… వేడుకలు నిర్వహిస్తున్నారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement