Friday, November 22, 2024

గోద్రా అల్లర్ల దోషి కుమార్తెకు బీజేపీ టికెట్‌..

2002 గోద్రా అనంతర నరోడా పాటియా ఊచకోత కేసులో దోషిగాఉన్న వ్యక్తి కుమార్తెకు అసెంబ్లి ఎన్నికల్లో పోటీచేసేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. అహ్మదాబాద్‌లోని నరోడా స్థానం నుంచి ఆమె పోటీకి సిద్ధమైంది. 97 మంది ముస్లింలను చంపిన నరోడా పాటియా కేసులో 16 మంది నిందితుల్లో ఒకరైన మనోజ్‌ కుక్రానీ కుమార్తె పాయల్‌ కుక్రానీ అధికార పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నది. ఆమె అనస్థీషియా వైద్యురాలు. తనకు టికెట్‌ కేటాయించడం పట్ల 30 ఏళ్ల పాయల్‌ హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోడీ, అమిత్‌షాతోపాటు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతోపాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కుక్రాని కుటుంబం ఆధిపత్య సింధ్‌ వర్గానికి చెందినది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బలరామ్‌ తవానీకి బదులు పాయల్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. కాగా ఆమె అభ్యర్థిత్వం పట్ల పార్టీలో ఒకవర్గం అసంతృప్తితో ఉన్నట్లుతెలుస్తోంది. సింధేతర వ్యక్తిని వివాహం ఆడటం కూడా పార్టీ వర్గాల వ్యతిరేకతకు కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement