మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జయంత్ సిన్హా కు బీజేపీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది . అయిదో విడుత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ జయంత్ సిన్హా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పార్టీ కార్యకలాపాల్లో, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఆ ఎంపీపై పార్టీ సీరియస్ అయ్యింది. జార్ఖండ్‌లోని హజారిబాగ్ సీటు నుంచి మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించడంతో ఎంపీ జయంత్ ప్రచారంలో పాల్గొనలేదు. కీలకమైన ఆ సీటు నుంచి తాను పోటీ చేయడం లేదని మార్చిలో సిన్హా ప్రకటించారు. మనీశ్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని, మీరు మీ ఓటును కూడా వేయలేదని, మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహూ తెలిపారు. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఎంపీ జయంత్‌ను పార్టీ కోరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement