Friday, November 22, 2024

క‌ర్నాట‌క ఎల‌క్ష‌న్స్ – ప్లాన్ బి కి తెర‌తీసిన బిజెపి – జెడిఎస్ కు ఆహ్వానం..

బెంగుళూరు – క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో బిజెపి మ్యాజిక్ ఫిగ‌ర్ 113కి దూరంగా ఉండ‌టంతో ప్లాన్ బికి తెర‌తీసింది.. 224స్థానాల‌కు గాను కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కూ 115 స్థానాల‌లో ముందంజ‌లో ఉంది. బిజెపి 78 చోట్ల లీడ్ లో ఉండ‌గా, జెడిఎస్ 25 చోట్ల ముందంజ‌లో ఉంది.. దీంతో రెండో స్థానానికి బిజెపి ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశాలు ఉండ‌టంతో బిజెపి అధీష్టానం జెడిఎస్ తో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించింది.. బిజెపి – జెడిఎస్ తో క‌ల‌సి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ది.దీంతో బిజెపి కీల‌క‌నేత‌లు జెడిఎస్ అధినేత కుమార స్వామితో మంత‌నాలు ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో స‌హా ఇత‌ర ప‌దవుల‌ను కుమార‌స్వామికి ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం.. అయితే ఇంత వ‌ర‌కు కుమార స్వామి నుంచి ఎటువంటి స్పంద‌న లేదు.. ఫ‌లితాలు పూర్తి స్థాయిలో విడుద‌ల‌య్యే వ‌ర‌కూ వేచి చూసే ధోర‌ణిలో కుమార‌స్వామి ఉన్నారు..

కాగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్టే దిశ‌గా దూసుకుపోతున్న‌ది. 224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 115 స్థానాల‌లో ముందంజ‌లో ఉంది.. పోస్ట‌ల్ బ్యాలెట్స్ లో గ‌ట్టి పోటీ ఇచ్చిన బిజెపి ప్ర‌స్తుతం 77 స్థానాల‌లో మాత్ర‌మే లీడ్ లో ఉంది.. ఇక కుమార‌స్వామి పార్టీ జెడిఎస్ 25స్థానాల‌లో ముందంజ‌లో ఉంది.. . కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌ధాన నాయ‌కులు డి కె శివ‌కుమార్, సిద్ద‌రామ‌య్య‌, గుండూరావు, త‌దిత‌రులు అధీక్యంలో ఉన్నారు.. చెన్న‌ప‌ట్నం నుంచి పోటీ చేసిన జెడిఎస్ అధ్య‌క్షుడు కుమార‌స్వామి తొలి రౌండ్ లో వెనుకంజ‌లో ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత రౌండ్ లో లీడ్ లోకి వ‌చ్చారు…. అలాగే బొమ్మై క్యాబినేట్ లోని 9 మంది మంత్రులు వెనుకంజ‌లో కొన‌సాగుతున్నారు.. ఇక బ‌ళ్లారి మైన్స్ కింగ్ గాలి జనార్ధ‌న‌రెడ్డి, అయ‌న స‌తీమ‌ణి లు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో వెనుకంజ‌లో ఉన్నారు.. బళ్లారి సెగ్మెంట్ లో మొత్త అయిదు స్థానాలుండ‌గా అన్ని స్థానాల‌లో కాంగ్రెస్ ఆధీక్యంలో దూసుకుపోతున్న‌ది. స్వ‌ల్ప మెజార్జీలో ఉన్నారు.. కాగా, లీడ్ లు ప్ర‌తి రౌండ్ రౌండ్ కి మారిపోతున్నాయి.. బిజెపి, కాంగ్రెస్ మ‌ధ్య లీడ్ క్ష‌ణం క్ష‌ణం మారుతున్నాయి.. ఒక‌నొక ద‌శ‌లో 140 చోట్ల అధీక్యం క‌న‌బ‌రిచిన కాంగ్రెస్ ప్ర‌స్తుతం 115 స్థానాల‌కు ప‌డిపోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement