Friday, November 15, 2024

బీజేపీ ఎంపీపై కోర్టు సీరియస్​.. పదేండ్ల క్రితం నాటి కేసులో దోషిగా నిర్ధారణ

పదేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎలక్షన్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​  (ప్రవర్తనా నియమావళి)ని ఉల్లంఘించినందుకు బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషిని లక్నోలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవ్వాల దోషిగా నిర్ధారించింది. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత రీటా బహుగుణ ఇవ్వాల (శుక్రవారం) కోర్టుకు హాజరయ్యారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జోషి సహా ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.

ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జోషితో సహా దోషులందరినీ విడుదల చేసింది. అయితే వారిని ఆరు నెలల పాటు ప్రొబేషన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఆరు నెలల సాధారణ పరిశీలనలో సత్ప్రవర్తనను కొనసాగించాలంటే, ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున రెండు పూచీకత్తులు, అదే మొత్తానికి వ్యక్తిగత బాండ్‌ను జిల్లా పరిశీలన అధికారి ముందు దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది.

బహుగుణ సహా ఐదుగురు దోషులను 30 రోజుల్లోగా జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ప్రొబేషన్ అధికారి ముందు హాజరైన తేదీ నుండి పరిశీలన కాలం లెక్కలోకి తీసుకుంటారు. ఈ కేసు 2012 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రీటా బహుగుణ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. 2012 ఫిబ్రవరి 17న కేసు నమోదు కాగా, అదే ఏడాది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement