ఏపీలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ చురకలంటించారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటోన్న ప్రభుత్వం రేపు సినిమాలు కూడా తీస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ఏపీలో అభివృద్ధి కనిపించట్లేదని, అప్పులు చేసే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఏపీ ప్రభుత్వం ఆధారపడుతోందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తోన్న అభివృద్ధి పనులను కూడా తామే చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన చెప్పారు. ఉక్కు పరిశ్రమ అభివృద్ధి కావాలని ఆయన అన్నారు. తాము ఉద్యోగుల సంక్షేమం గురించే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.