బీజేపీ సీనియర్ నేత నేత, కేంద్ర మాజీ మంత్రి దిలీప్ కుమార్ మన్ సుఖ్ లాల్ గాంధీ (69) కరోనాతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయన వ్యక్తిగత పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఆయనలో కరోనా లక్షణాలు బయటపడగా వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దిలీప్ గాంధీ నౌకాయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోక్‌సభ సభ్యుడిగా గతంలో ఆయన ఎన్నికయ్యారు. గాంధీకి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా దిలీప్ గాంధీ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement