జమ్మూకశ్మీర్ లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తమ్ముడు దేవేందర్‌సింగ్ రాణా (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నగ్రోటా స్థానం నుంచి గెలుపొందారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత జోగిందర్ సింగ్‌పై 30,472 ఓట్లతో విజయం సాధించారు. 2014లో ఎన్సీ పార్టీ తరఫున అదే స్థానం నుంచి గెలుపొందారు. డోగ్రా జాతికి సంబంధించి బలమైన నేతగా ఆయనకు పేరుంది. దేవేందర్‌సింగ్ మృతిపై లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను బాధకు గురిచేసిందన్నారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సురీందర్ కుమార్ చౌదరీ కూడా సంతాపం వ్యక్తం చేసి.. దేవేందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -