Tuesday, November 26, 2024

ఢిల్లి బాట పడుతున్న బీజేపీ నేతలు.. కీలక మంతనాలు జరుపుతున్నట్లు చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లి బాట పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఢిల్లికి పయనమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లి బాట పట్టిన నేతలు ఒకరిద్దరు మాత్రమే వెనక్కి వచ్చేశారు. కానీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం ఇంకా ఢిల్లిలోనే ఉన్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుడా గురువారం సాయంత్రం ఢిల్లికి పయనమయ్యారు. మొన్న మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా ఢిల్లికి వెళ్లొచ్చారు. మళ్లిప్పుడు ఏకంగా బీజేపీ చీఫ్‌ హస్తినకు వెళ్లడంతో ఢిల్లి ఎపిసోడ్‌పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లిలో అసలు ఏం జరుగుతుందో అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ ఢిల్లికి వెళ్లి దాదాపు మూడ్రోజుల అవుతోంది. ఇప్పటికే ఇంకా వారు అక్కడే ఉన్నారు. ఈ విధంగా నేతల ఢిల్లి టూర్‌ను చూస్తుంటే మాత్రం ఢిల్లి పెద్దలతో వీరు కీలక మంతనాలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను బీజేపీలో ఏమైనా చేర్చుకుంటున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పీఎం రాష్ట్ర పర్యటన, ఈడీ దాడులు, చేరికలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఇలా వరుసగా ఢిల్లిబాట పడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రేపు (శుక్రవారం) జరిగే పార్లమెంట్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకే తాను వెళ్తున్నట్లు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇంకా ఢిల్లిdలో కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ అక్కడే ఉండడంతో అక్కడి పెద్దలతో కీలక మంతనాలు జరపనున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement