Friday, November 22, 2024

హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని.. బోర్డర్ వద్ద షరతులు ఎందుకు?: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి

ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించడంపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ పదేళ్ల వరకు తెలంగాణ-ఆంధ్రకు ఉమ్మడి రాజధాని అని గుర్తుచేశారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌ అని, కరోనా రోగులు, అత్యవసర సేవల కోసం ఆంధ్ర నుంచి వచ్చేఅంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉందన్నారు. వైద్యానికి సంబంధించి అయితే ఎల్లలు కూడా అవసరం లేదని, మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అనే విషయాన్నిపోలీసులు గుర్తించాలని విష్ణువర్ధన్‌రెడ్డి హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement