బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు బ్రాహ్మణులు, బనియాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భోపాల్‌లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులని వ్యాఖ్యానించారు. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువమంది పార్టీ కార్యకర్తలుగా వుండడం వల్ల మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ, బనియాల పార్టీగా పిలుస్తుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందని చెప్పారు.
అయితే బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్‌రావు వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. మురళీధర్‌రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. బ్రాహ్మణులు, బనియాలను ఆ పార్టీ అవమానించిందని మండిపడ్డారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని ఆయన విమర్శించారు. కాగా తన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్‌రావు కౌటింగ్ ఇచ్చారు.