Friday, November 22, 2024

BJP Josh – ఒడిశాలో బిజెడికి షాక్… 24 ఏళ్ల నవీన్ పట్నాయిక్ పాలనకు తెర

మ్యాజిక్ ఫిగ‌ర్ సాధించిన‌ బిజెపి
24 ఏళ్లు న‌వీన్ ప‌ట్నాయిక్ పాల‌న‌కు చెక్
ఇప్ప‌టికే బిజెపి 75 స్థానాల‌లో లీడింగ్
బిజెడి 58 స్థానాల‌కే ప‌రిమితం
ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల‌లోనూ క‌మ‌లందే జోరు
21 స్థానాల‌కు గానూ 19 చోట్ల బిజెపి పాగా

ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్ (బీజేడీ) జైత్రయాత్రకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది. 2000 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈసారి పదవికి దూరం కానున్నారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల‌లో 75 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 58 చోట్ల ముందంజలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ వివరాల ప్రకారం.. మరో 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. ఇత‌రులు మూడు చోట్ల లీడింగ్ లో ఉన్నారు..

- Advertisement -

ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 74.. ఈ నేపథ్యంలో బీజేపీ 75 చోట్ల లీడ్ లో కొనసాగుతుండడంతో ఒడిశాలో ఈసారి అధికార మార్పిడి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తంగా 74.4 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 73.20 శాతమే. గత ఎన్నికల్లో బీజేడీ 113 సీట్లు గెలుచుకోగా బీజేపీ 23 స్థానాలు, కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక మొత్తం 21 లోక్ స‌భ స్థానాలుండ‌గా 19 చోట్ల బిజెపి లీడ్ లో ఉంది.. కాంగ్రెస్, బిజెడి లు చెరో స్థానంలో అధీక్యంలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement