మంత్రి కొప్పుల ఈశ్వర్ ..రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి తమ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…బిజెపి అరాచకీయాన్ని,ఆ పార్టీ నాయకుల వ్యవహారాన్ని తూర్పారబట్టారు.బిజెపి ఢిల్లీ నాయకులు తప్పుడు ప్రకటన చేస్తే, నిరాధారమైన ఆరోపణలకు దిగితే..ఇక్కడి గల్లీ నాయకులు,కాషాయ గుండాలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బిజెపి నాయకులు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్,వారి కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
రాజకీయం చేయడం మాని అరాచకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు, ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, ఎంపి అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ లు కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ గౌరవానికి బిజెపి కేంద్ర నాయకత్వం మచ్చ తెచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీకి ప్రజలంటే ఏ మాత్రం పట్టింపులేదని, రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విర్శించారు. శాంతికి భంగం కలిగించే బిజెపి నాయకుల చర్యలను, రౌడీయిజాన్ని సహించవద్దని, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.