మునుగోడు ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠబరితంగా సాగుతోంది. రౌండ్‌రౌండ్‌కు ఫలితాల తీరు మారుతూ వస్తుంది. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ కూడా కౌంటింగ్‌ను జాగ్రత్తగా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బీజేపీ మాత్రం రౌండ్ల వారీగా ఫలితాల వివరాలను ఎందుకు ఆలస్యంగా వెల్లడిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి ఫలితాల విడుదలలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ఆరా తీశారు. రౌండ్ల వారీగా ఫలాతాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించకపోవడంపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో కిషన్ రెడ్డి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలు అప్‌డేట్ చేసినట్లు బీజేపీ చెబుతోంది. మరోవైపు ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందన్న బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ లీడ్ వస్తే తప్ప ఫలితాలు అప్‌డేట్ చేయరా? అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BREAKING : మునుగోడు కౌంటింగ్ తీరుపై బీజేపీ సీరియస్.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కిషన్ రెడ్డి ఫోన్..
Advertisement
తాజా వార్తలు
Advertisement