మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేర్వేరుగా ఆయా చోట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ దొంగల పార్టీ అని, ప్రభుత్వాలను కూల్చే పని పెట్టుకుందన్నారు. రైతాంగాన్ని, ప్రజలను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. కేంద్ర మంత్రులు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధించిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని, రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆడబిడ్డకు మేనమామ గా కళ్యాణాలక్ష్మి పథకం అందించడం జరుగుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయిదు వందల పెన్షన్ కూడా రావడం లేదు అని, మన రాష్ట్రంలో 3 వేళా రూపాయల పెన్షన్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన ఘనట కేసీఆర్ కే దక్కిందన్నారు. సాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు పంటలు బాగా పండి, దిగుబడి పెరగడానికి కారణం సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది, ప్రతి ఏటా 3 వేల కోట్లు నష్టం వచ్చినా భరిస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. లట్టుంగాడు, పొట్టుంగాడు వచ్చి వరి వేయమన్నరు.. తీరా టైంకు చేతులు ఎత్తేసిండ్రు అని, చేసేది లేక మళ్ళీ మన సీఎం కేసీఆర్ రే రైతులు నష్టపోవద్దని ధాన్యం కొంటున్నాడు అని గుర్తు చేశారు.