కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే మొదటి జాబితాలో 33 మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించింది.
వారిలో మాజీ మంత్రి హర్షవర్ధన్తోపాటు ఎప్పుడూ వివాదాల్లో ఉండే సాధ్వి ప్రగ్యా ఠాకూర్, ప్రస్తుత మంత్రులు మీనాక్షి లేఖి, జాన్ బర్లా కూడా ఉన్నారు. ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాలకుగానూ నలుగురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి పోటీకి అకాశం ఇవ్వలేదు. అదేవిధంగా అస్సాంలో 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా ఐదుగురు కొత్తవారు. ఇక ఛత్తీస్గఢ్లో నలుగురు, గుజరాత్లో ఐదుగురు, జార్ఖండ్లో ఇద్దరు, మధ్యప్రదేశ్లో ఏడుగురు చొప్పున ఉన్నారు.