Tuesday, September 17, 2024

BJP – జ‌మ్ము క‌శ్మీర్ బిజెపి జాబితాలో ట్విస్ట్ – తొలి జాబితా రద్దు ..

ఉద‌యం 44 మందితో తొలి జాబితా
టాప్ లీడ‌ర్స్ పేర్లు గల్లంతు
నేత‌ల‌లో క‌ల‌వ‌రం.. అధిష్టానంపై ఆగ్రహం
జాబితాను ఉప‌సంహ‌రించుకున్న బిజెపి
కేవ‌లం 15 మందితో మ‌రో జాబితా విడుద‌ల

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఒంట‌రిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది.. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్ర ఎన్నిక‌లు మూడ విడత‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి.. ఈ నేప‌థ్యంలోనే బిజెపి నేటి ఉద‌యం తొలి జాబితాను 44 మందితో విడుద‌ల చేసింది.. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ లిస్ట్ లో బీజేపీ కీలక నేతల పేర్లు లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

జమ్ముకశ్మీర్‌ బీజేపీ చీఫ్ రవీందర్‌ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్‌ సింగ్‌, కవీందర్‌ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అలాగే మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు పేర్లు కూడా క‌నిపించ‌లేదు. దీంతో అక్క‌డి నేత‌ల‌లో క‌ల‌వ‌రం బ‌య‌లుదేరింది.. అధిష్టానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. దీంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం వెంటనే ఆ జాబితాను వెనక్కి తీసుకుంది. అనంతరం గంట వ్యవధిలోనే 15 మందితో మొదటి లిస్ట్ ను విడుదల చేసింది. కాగా, ముందు ఒంట‌రిగా పోటీ చేయాల‌ని భావించిన బిజెపి ఇప్ప‌డు పొత్తుల కోస‌మే లిస్ట్ ను మార్చింద‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. అయితే దీనిని బిజెపి దృవీక‌రించాల్సి ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement