లోక్‌సభ ఎన్నికల వేళ అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో పాటు కొత్త వారు ఉన్నారు. ఏడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్నాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి. ఈ జాబితాలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సీతా సోరెన్ దుమ్కా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ, కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, బిశ్వేశ్వర్ తుడు వంటి ముఖ్య నేతలకు బీజేపీ చాన్స్ ఇవ్వలేదు. పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసేందుకు వరుణ్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానం తలొగ్గలేదు. ఆయన స్థానంలో కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. అయితే.. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్ నుంచి కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ లో మొదటి దశలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం మార్చి 20నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. కొన్నేళ్లుగా వరుణ్ గాంధీ చేస్తున్న చర్యల వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీ ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ గాంధీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా.. లేక ఎస్పీతో జట్టు కడతారా అనేది తెలియాల్సి ఉంది.
హిమచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సీట్లు
గుజరాత్‌లో ఐదు, కర్నాటకలో ఒక స్థానం
పశ్చిమ బెంగాల్ 2 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జాబితాను బిజెపి విడుదల చేసింది. తాజాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో వారు చోటు సంపాధించుకున్నారు. సుధీర్‌శర్మ- ధర్మశాల, రవి ఠాకుర్- లాహౌల్ అండ్ స్పితి, రాజిందర్ రానా- సుజన్‌పూర్, ఇందర్ దత్ లకాన్ పాల్- బర్సార్, చైతన్య శర్మ- గాగ్రేట్, దేవిందర్ కుమార్ భుట్టో- కుట్లేహర్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఈ ఆరు స్థానాలకు ఏడు విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అదే రోజు హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. ఇక గుజరాత్‌లో ఐదు స్థానాలు, కర్ణాటకలో ఒక స్థానం, పశ్చిమ బెంగాల్‌లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది.