రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇండ్లపై జరిగిన ఈడి దాడులను రాజకీయపరమైన కోణంలోనే చూడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాదులోని అసెంబ్లీ టిఆర్ఎస్ ఎల్.పి కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే దాడులు చేసామని చెప్తున్నప్పటికీ, ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనన్నారు. ఇటీవల మునుగోడులో బిజెపి అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడం, నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన కుట్ర బట్టబయలవడంతో, రాష్ట్రంలో బిజెపి పలుచనవుతుందని, టిఆర్ఎస్ మరింతగా బలపడుతోందని భావించిన బిజెపి అధినాయకత్వం, టిఆర్ఎస్ నాయకులను సమాజంలో చులకన చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర అన్నారు. ఈనెల 12న మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీపై, నాయకులపై ఆరోపణ చేయడానికి చేసిన కుట్రపూరిత ప్రయత్నమే ఈడి దాడులన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు.
బిజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుంది.. ఈడి సోదాలు సిగ్గుచేటు : ఎమ్మెల్యే కోరుకంటి
Advertisement
తాజా వార్తలు
Advertisement