రాబోయే లోక్‌సభ ఎన్నికలు-2024 కోసం భారతీయ జనతా పార్టీ తన 8వ జాబితాను ప్రకటించింది. మొత్తం 11 మంది అభ్యర్థులతో కమలం పార్టీ ఈ జాబితాను ప్రకటించింది. ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ విడుదల చేసింది.
బీజేపీ ఎనిమిదో జాబితా అభ్యర్థులు
- జాజ్‌పూర్ (SC) – డా. రవీంద్ర నారాయణ్ బెహెరా.
- కంధమాల్ – శ్రీ సుకాంత కుమార్ పాణిగ్రాహి.
- కటక్ – శ్రీ భర్తృహరి మహతాబ్.
- గురుదాస్‌పూర్ – శ్రీ దినేష్ సింగ్ “బబ్బు”
- అమృత్‌సర్ – శ్రీ తరంజిత్ సింగ్ సంధు.
- జలంధర్ (SC) – శ్రీ సుశీల్ కుమార్ రింకు.
- లూథియానా – శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టు.
- ఫరీద్‌కోట్ (SC) – శ్రీ హన్స్ రాజ్ హన్స్.
- పాటియాలా – శ్రీమతి. ప్రణీత్ కౌర్.
- ఝర్గ్రామ్ (ST) – డా. ప్రణత్ టుడు.
- బీర్భూమ్ – శ్రీ దేబాశిష్ ధర్.
తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించగా.. సెకండ్ లిస్ట్‌లో 72 మందిని వెల్లడించారు. మూడో జాబితాలో 111 మందిని.. ఇలా ఎనిమిది జాబితాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కోసం 27 మందితో కూడిన సభ్యులను జేపీ నడ్డా వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.