Saturday, January 18, 2025

BJP Manifesto – ఢిల్లీ ఎన్నిక‌ల‌లో ఓట‌ర్ల‌పై బిజెపి ఉచితాల వ‌ల‌…

న్యూ ఢిల్లీ – ఉచిత ప‌థ‌కాల‌కు దూరంగా ఉండే క‌మ‌ల‌నాధులు తాజాగా యు ట‌ర్న్ తీసుకున్నారు.. గ‌త రెండు సార్లు ఆప్ చేతిలో భంగ‌ప‌డ్డ బిజెపి ఈసారి ఎలాగైనా హ‌స్తిన పీఠం కైవసం చేసుకునేందుకు త‌న స‌ర్వ శ‌క్తుల‌ను ఒడ్డుతున్న‌ది.. దీంతో ఆ పార్టీ ఉచిత తాయిలాను బ‌య‌ట‌కు తీసింది.. ఆప్, కాంగ్రెస్ పార్టీల‌కు తీసిపోని విధంగా ఢిల్లీ ఓట‌ర్ల‌పై ఫీ ప‌థ‌కాల‌ను కుమ్మ‌రించింది.. దేశ రాజధాని వాసులకు పలు సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు ఉచితాలతో భరోసా ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర-1’ను శుక్రవారంనాడు ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ ప‌త్రాన్ని విడుదల చేశారు.

ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోని ప్రతి మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. మహిళా సాధికారికత లక్ష్యంగా వారికి మరింత ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామని హామీ ఇచ్చింది. పెరుగుదుల ధరవరలతో గృహాలపై పడుతున్న భారాన్ని దష్టిలో ఉంచుకుని ఎల్పీజీ సిలెండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని వాగ్దానం చేసింది. పండుగ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తాన‌ని హామీ ఇచ్చింది. ఇక వృద్దాప్యపు పించ‌న్ 2500, 3000 ఇస్తామ‌ని పేర్కొంది.

- Advertisement -

మేనిఫెస్టో విడుదల అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ, నగర వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు కొత్తగా చర్యలు తీసుకుంటూ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. బడుగు వర్గాలతో సహా సమాజంలోని అన్నివర్గాలను సంక్షేమానికి పార్టీ కృషి చేస్తుందన్నారు. 2014లో తాము 500 వాగ్దానాలు చేశామని, 499 వాగ్దానాలను అమలు చేశామని, 2019లో 235 వాగ్దానాల్లో 225 నెరవేర్చామని చెప్పారు. తక్కినవి కూడా వివిధ దశల్లో అమలుకు సిద్ధమవుతున్నాయని నడ్డా చెప్పారు.

మేనిఫెస్టోలో కీలక వాగ్దానాలు

-మహిళా సమృద్ధి యోజన కింద రూ.2,500 ఆర్థిక సాయం
-ఢిల్లీలోని పేద మహిళలకు రూ.500 సిలెండర్ సబ్సిడీ
-ప్రతి హోలి, దిపావళికి ఒక సిలెండర్ ఉచితం

గర్భిణీ స్త్రీలకు రూ.21,000 సాయం
-తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారతి యోజనకు నిర్ణయం,
అదనంగా రూ.50,00 హెల్త్ కవర్.

మహిళలకు 6 న్యూట్రీషనల్ కిట్‌లు,

Advertisement

తాజా వార్తలు

Advertisement