Saturday, November 23, 2024

బీజేపీ.. కార్పొరేట్ల తొత్తు : మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పాలన తెలంగానలోని నేటి, రేపటి తరానికి వరమన్నారు. కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ల‌కు తొత్తుగా మారింద‌న్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్‌ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని పేర్కొన్నారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement