Friday, November 22, 2024

ఉచిత విద్యుత్‌పై బీజేపీ కుట్రలు: కేజ్రీవాల్‌

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులపై ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిప్పులు చెరిగారు. పహార్‌గంజ్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లిలో ఉచిత విద్యుత్‌ సరఫరాను అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ సరికాదన్నారు. ఉచిత విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఎందుకు నిలిపివేయాలి? అని ప్రశ్నించారు.

 కేజ్రీవాల్‌ బతికున్నంత వరకు ఢిల్లిలో ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్కసారి అధికారం ఇవ్వండి. మంచినీరు, విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేసినట్టే.. చెత్త సమస్యను కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. చెత్త విషయంలో బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఢిల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో 250 స్థానాలకు గానూ ఆప్‌ 230 స్థానాల్లో గెలవాలన్నారు. అప్పుడే ఆప్‌ అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement