Tuesday, November 26, 2024

వీడియో: దుర్గమ్మ గుడి వద్ద లైవ్‌లో అన్యమత ప్రచారం

విజ‌యవాడ క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో అన్య‌మ‌త ప్రచారం జరగడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెద్ద‌గా బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఈ విష‌యం చాలా సీరియ‌స్‌గా మారింది. శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల‌ లైవ్‌ను దుర్గ గుడి పాల‌క‌వ‌ర్గం ఏదో లోక‌ల్ ఛాన‌ల్‌కు అప్ప‌గించింది. ఉత్స‌వాల లైవ్ టెలీకాస్ట్ అవుతున్న స‌మ‌యంలో మ‌ధ్య‌లో క్రైస్త‌వ మిష‌న‌రికీ సంబంధించిన ఓ వ్య‌క్తి మాట్ల‌డుతున్న మాట‌లను దాదాపు అర‌గంటసేపు ప్ర‌సారం చేశారు.

గుడిలో లైవ్ చూస్తున్న భ‌క్తులు ఇది చూసి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ లైవ్ ప్ర‌సారం అవుతున్న ఎల్ఈడీ టీవీల‌ను ధ్వంసం చేశారు. అయితే, దుర్గ గుడికి కోట్ల‌లో ఆదాయం వ‌స్తుంద‌ని స్వంతంగా ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం పెట్టుకోకుండా ఇదేంటి అని ప‌లువురు భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు. దుర్గ గుడిలో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విశ్వ‌హిందూ ప‌రిష‌త్ క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అటు ఇంద్రకీలాద్రి పై జరిగిన అన్యమత ప్రచారానికి బాధ్యులైన సమాచార పౌర సంభందాల శాఖ ఉద్యోగులను వెంటనే విధుల నుండి తొలగించాల‌ని బీజేపీ డిమాండు చేస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement