Saturday, January 18, 2025

BJP | స్థానిక సంస్థల్లో ఒంటరిగానే పోటీ..

  • మీడియాతో చిట్ చాట్ లో కిషన్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. మా పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు.

‘‘ఇప్పుడు మా పార్టీకి వచ్చే అధ్యక్షుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటారు. అందుకోసం గత ఆరు నెలలుగా వర్క్ ఔట్ చేస్తున్నాం. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వచకపోవడం వలనే 15వ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రిలీజ్ కాలేదు. చట్ట ప్రకారమే డబ్బులు రిలీజ్ చేస్తాం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొనసాగిస్తోంది. చెరువుల ఆక్రమణను అరికట్టే చట్టం గతంలోనూ ఉంది, పాత చట్టానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అని పేరు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. ఏడు నెలలుగా జీహెచ్ఎంసీ పరిధిలో వీధిలైట్ల నిర్వహణకు నిధులు రావడం లేదు.

తెలంగాణకు ఏం తెచ్చారని అంటున్నారు. టెక్స్టైల్ పార్క్ తెచ్చాను. జహీరాబాద్ ఇండస్ట్రీల్ పార్క్ తెచ్చాను. ఆర్ఆర్ఆర్ తెచ్చాను. కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది మేమే. పసుపు బోర్డు మేము తెస్తే ఓ మంత్రి తాను లేఖ రాస్తానే వచ్చిందని అన్నారు. నాకు వారి మాటలు వింటే నవ్వు వస్తుంది.

హైదరాబాద్ మెట్రో 2 ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. సహాయం చేయడం మా బాధ్యత. ఢిల్లీలో కూడా దీనిపైన వర్క్ ఔట్ చేస్తున్నాను. రీజినల్ రైల్ రింగ్ సర్వేకు మేము డబ్బులు కేటాయించాం. ఆర్ఆర్ఆర్ అలెన్మెంట్ పూర్తి ఐతే.. రీజినల్ రైల్ రింగ్ సర్వే మొదలు అవుతుంది.’’అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement