Friday, November 22, 2024

BJP Campaign – కెసిఆర్ క‌బంద హ‌స్తాల నుంచి తెలంగాణ‌కు విముక్తి చేయ‌డ‌మే బిజెపి ల‌క్ష్యం – జెపి న‌డ్డా

నిజామాబాద్: తెలంగాణ‌ను కుటుంబ పాల‌న నుంచి విముక్తం చేయ‌డ‌మే బిజెపి లక్ష్య‌మ‌ని ,ఈ విముక్తి ఈ ఎన్నిక‌ల‌తో సాధిస్తామ‌ని జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.. నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. .తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ వంచించారన్నారు. .కుటుంబ పాలన నుండి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించిన విషయాన్నిగుర్తు చేసిన ఆయ‌న తెలంగాణలో కూడ కుటుంబ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు .కెసిఆర్ క‌మిష‌న్ల కోసం ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారని అంటూ దళితబంధులో ప్రజా ప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.


వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపు రేఖలను మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తన కుటుంబం మాత్రమే అభివృద్ది చెందిందని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ హయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న హమీతో పాటు అనేక హమీలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement