Sunday, September 8, 2024

BJP Campaign – అవినీతి డ‌బ్బును పేద‌ల‌కు పంచుతాం ….. మోదీ

ఈడీ స్వాధీనం సొమ్ము పేద‌ల‌కే చెందాలి
పంచేందుకు మార్గాల‌ను అన్వేషిస్తున్నాం
ఈసారి 400 సీట్లు గ్యారంటీగా గెలుస్తాం
మూడో సారి అధికారం మాదే
ఉచిత బ‌స్స ప‌థ‌కంతో మెట్రోకు ముప్పు
మెట్రో విస్త‌ర‌ణ నిలిచిపోయే ప్ర‌మాదం
ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌భ‌లో మోదీ

అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు ప్ర‌ధాని మోడీ … ద‌ర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న‌నేప‌థ్యంలో వారికి మోదీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు . ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో నేడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ, ”గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతాం. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోం. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరా” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ అంశంపై ప్రధాని మరోసారి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడానికి ప్రజలే కారణమన్నారు. మునుపెన్నడూ లేనంతగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని.. వాళ్లే తమలో విశ్వాసం నింపారని పేర్కొన్నారు.

400 సీట్ల టార్గెట్

కాగా, తమ పార్టీ బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతుంది. మూడో దఫాలో పేదలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తాను, కొత్త ప్రభుత్వంలో వారి కోసం నేను చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జూన్ 4 ఎంతో దూరంలో లేదు, తమ ప్రభుత్వం మరోసారి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం బీజేపీ-ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటే, మరోవైపు ఇండియా కూటమి దేశంలో అస్థిరత సృష్టించాలని చూస్తుంది. ఇలాంటి వారికి ఓటు వేసి తమ విలువైన ఓటును వృధా చేయకండి అని మోడీ అన్నారు. అలాగే, ఇండియా కూటమి అభ్యర్థి గెలిస్తే వారు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ల వల్ల ఎలాంటి పనులు జరగవని తెలిపారు.

500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారం అయింది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లాల్లను టెంట్ కింద చూసిన వారు ఎంతగానో బాధపడేవారు. మీ ఓటు వల్లే రామమందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. కానీ రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ మార్చాలనుకుంటుంది. వారు వస్తే రామ్‌లల్లాను మళ్లీ టెంట్‌కు తరలిస్తారని మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కుప్పకూలడం కాయం అయిందని అన్నారు.

ఉచిత బ‌స్సుతో మెట్రోల‌కు న‌ష్టాలు..

చాలా రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తున్న ఉచిత బ‌స్సుప్ర‌యాణం వల్ల భారీగా మెట్రోల‌కు న‌ష్టం వ‌స్తుంద‌న్నారు.. గ‌ణ‌నీయంగా వాటి ఆదాయం ప‌డిపోతున్న‌ద‌ని, దీనితో నిర్వ‌హ‌ణ క‌ష్ట‌సాధ్య‌మవుతుంద‌న్నారు.. అలాగే దీని ప్ర‌భావంతో మెట్రో విస్త‌ర‌ణ కూడా నిలిచిపోయే ప్ర‌మాదం ఉంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement