Friday, November 22, 2024

BJP Call – బెంగాల్ బంద్… స్థంభించిన జ‌న‌జీవ‌నం

బిజెపి ఇచ్చిన పిలుపుతో అన్ని బంద్
ప‌లు చోట్ల బిజెపి, తృణ‌మూల్ శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు
ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా భారీ బందోబ‌స్తు
ఇద్ద‌రు బిజెపి ఎమ్మెల్యేలు అరెస్ట్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్‌’ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం పట్ల నిర‌స‌న‌గా బిజెపి పార్టీ నేడు బెంగాల్‌ బంద్ పిలుపు ఇచ్చింది.. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా బంద్ కొన‌సాగుతున్న‌ది. ఈ బంద్ తో దీంతో రాష్ట్రం స్తంభించింది.

పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్‌ కారణంగా బెంగాల్ లో పలు చోట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అటు బంద్‌ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు జారీ చేశాయి. మరోవైపు, బిజెపి ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి మరో చోటుకు తరలించారు.

- Advertisement -

బిజెపి, తృణమూల్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘర్షణలు..

నదియా జిల్లాలో బిజెపి, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బంద్‌ చేపట్టాలని దుకాణాలను మూసివేస్తున్న భాజపా కార్యకర్తలను టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆమెకు అంకితమిస్తున్నా: దీదీ
ఇదిలా ఉండగా.. నేడు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛాత్ర పరిషద్‌ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఈ రోజును కోల్‌కతా హత్యాచార ఘటనలో బలైన వైద్యురాలికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. ”ఆ ఘోరకలిలో ప్రాణాలు కోల్పోయిన సోదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని ఆశిస్తున్నా. ఇలాంటి అమానవీయ చర్యలకు బలవుతున్న మహిళలందరి పట్ల మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం” అని ఆమె రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement