తెలంగాణ శాసన మండలి ఎన్నికలకు బీజేబీ సిద్ధమైంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అందులో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. కాగా, తాజాగా శాసన మండలి స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం (జనవరి 10) ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు.
నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి.
కరీంనగర్- నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య
కరీంనగర్- నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల అభ్యర్థిగా అంజి రెడ్డి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు శాసన మండలి అభ్యర్థులను ప్రకటించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. కాగా.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీల… కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.
దీంతో ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండనుందని అంచనాలు వేస్తున్నారు.