Friday, November 22, 2024

తెలంగాణలో బీజేపీ, జనసేన పోటీ.. ఖమ్మం కార్పొరేషన్ పై గురి

ఏపీలో జనసేన-బీజేపీ పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం జనసేనతో బీజేపీ అంతగా కలిసున్నట్టు లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా.. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే, తాజాగా తెలంగాణలో మళ్లీ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు జనసేన వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో జనసేన, బీజేపీ నాయకులు చర్చలు జరిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ  చయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా, ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ తరుపున పవన్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement