Tuesday, November 26, 2024

కౌశిక్ రెడ్డికి చేదు అనుభ‌వం..జై ఈట‌ల అంటూ నినాదాలు..

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతోంది. అయితే ప‌లు చోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నార‌ని గ్రామస్తులు కౌశిక్ రెడ్డిని నిలదీశారు. నీకు ఇక్కడేం పని.. ఎందుకొచ్చావంటూ ఆయన్ని ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి దొంగ ఓట్లు వేయించడానికే వచ్చారంటూ ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఎదుటే పలువురు ‘జై ఈటల’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటడంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికుడైన కౌశిక్ రెడ్డిని ఎందుకు పంపారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేప‌టికి అక్క‌డి ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement