Wednesday, November 20, 2024

BiZ: ఇవ్వాల్టి నుంచి పేటీఎం ఐపీఓ షురూ.. విక్రయానికి రూ.8,300 కోట్ల విలువైన షేర్లు..

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు (Paytm IPO) వస్తోంది. ఇందులో రూ.8,300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు. ఈ నిధులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.10,000కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తున్నారు. ఇవి వారికి చెందుతాయి. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8,235 కోట్లు సమీకరించింది.

ఈరోజు ప్రారంభమై, 10వ తేదీన‌ ముగియనున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.2080- 2150గా నిర్ణయించారు. మొత్తం ఇష్యూలో 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయిస్తారు. రిటైలర్లు కనీసం 6 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది. ఇష్యూ గరిష్ఠ ధర ప్రకారం చూస్తే దీనికి రూ.12,900 అవుతుంది. గరిష్ఠంగా ఒకరు 15 లాట్లకు దరఖాస్తు చేయొచ్చు. అంటే రూ.1,93,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement