Saturday, November 23, 2024

సంచలనం సృష్టిస్తున్నా బిట్‌ కాయిన్..

న్యూఢిల్లి, (ప్రభ న్యూస్‌): క్రిఎ్టో కరెన్సీలు సంచలనం సృష్టిస్తున్నాయి. క్రిఎ్టో కరెన్సీ మార్కెట్‌లో మొత్తం విలువ 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఉదయం 7.38 నిమిషాలకు ఈ ఘనత సాధించింది. 3.01 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరుకున్నట్టు కాయిన్‌గెకో ప్రైసింగ్‌ తెలిపింది. మూడో, నాల్గో అతిపెద్ద టోకెన్‌లు.. బినాన్స్‌, సోలానాలు.. గత ఏడు రోజుల్లో 20 శాతం కంటే ఎక్కువ రాణించాయి. ఏడు అతిపెద్ద నాణాలు గత వారంలో భారీగా పెరిగాయి. సోమవారం బిట్‌ కాయిన్‌ సుమారు 6 శాతం వరకు పెరిగింది. దీంతో బిట్‌ కాయిన్‌ విలువ 66,339 డాలర్ల వరకు ఎగిసింది.

గతంలో వెళ్లిన 67,000 డాలర్లకు సమీపానికి చేరుకుంది. ఈథర్‌ కరెన్సీ కూడా.. మూడు శాతం పెరిగి.. రికార్డు స్థాయి 4,768 డాలర్ల వరకు వెళ్లింది. క్రిఎ్టో కరెన్సీ తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గతంలో బిట్‌ కాయిన్‌ భారీగా పెరిగి.. ఆ తరువాత.. వేలాది డాలర్ల మేర పడిపో యింది. పలుమార్లు నష్టపోయి.. సగాని కంటే తక్కువ ధరకు వెళ్లింది. బిట్‌ కాయిన్‌తో పాటు ఇతర క్రిఎ్టో కరెన్సీలు కూడా భారీ ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. మళ్లి ఒక్కసారిగా పెరగడం ప్రారం భించాయి. మళ్లి ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. క్రిఎ్టో మార్కెట్‌ ఇప్పటికే దాని 2020 సంవత్సరాంతపు విలువ నుండి దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.

పెట్టుబడిదారుల భారీ కొనుగోళ్లే దీనికి కారణం. ఈథర్‌తో పాటు సొలానా వంటి కరెన్సీలు కూడా ఎంతో మందిని ఆకర్శిస్తున్నాయి. బిట్‌ కాయిన్‌లు ఇంత భారీగా పెరగడానికి కారణంగా.. బిట్‌ కాయిన్‌ లింక్డ్‌.. ఈటీఎఫ్‌ అనేది యూఎస్‌ ట్రేడింగ్‌లో అరంగేట్రం చేయడం. అదేవిధంగా వారాంతంలో ఎలన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ క్రిఎ్టో కరెన్సీల పెరుగుదలకు ఆజ్యం పోసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement