Friday, November 22, 2024

40వేల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌..

క్రిఎ్టో కరెన్సీ గురువారం పుంజుకుంది. దాదాపు అన్ని క్రిఎ్టో కరెన్సీలు దూసుకుపోయాయి. డోజీకాయిన్‌, షిబాఇను రెండుశాతం లాభపడ్డాయి. టెర్రా, టెర్రా యూఎస్‌డీ మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఫెడ్‌ వడ్డీరేటు నేపథ్యంలో క్రిఎ్టో కరెన్సీ పుంజుకుంది. క్రిఎ్టోదిగ్గజం బిట్‌కాయిన్‌ 40వేల డాలర్లును అధిగమించింది. బిట్‌కాయిన్‌ 4.21శాతం లాభపడి 40,484.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. గత ఇరవైనాలుగు గంటల్లో 38,514డాలర్ల వద్ద కనిష్ఠాన్ని..41,693 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది.

బిట్‌కాయిన్‌ మార్కెట్‌క్యాప్‌ 768.56 బిలియన్‌ డాలర్లు పెరిగింది. బిట్‌కాయిన్‌ 52వారాల గరిష్టం 68,990.90 డాలర్లుగా కనిష్ఠం 28,825.76డాలర్లుగా నమోదైంది. బిట్‌కాయిన్‌ 4.53శాతం లాభపడి 40,514 డాలర్లు, ఎథేరియం 5.95డాలర్లుపెరిగి 2685 డాలర్లు నమోదుచేశాయి. సోలానా 4.08 శాతం పెరిగి 83.57డాలర్లు, అవలాంచె 5.10శాతం ఎగిసి 70.91డాలర్లు, కార్డానో 3.06శాతం పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement