Saturday, November 23, 2024

ప్రాణం తీసిన బిర్యాణి.. ఫుడ్‌ పాయిజనింగ్‌తో యువతి మృతి

కేరళలోని కాసరగోడ్‌ సమీపంలోని పెరుంబాలకి చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్‌ 31న కాసరగోడ్‌లోని రొమేనియా అనే రెస్టారెంట్‌ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ‘కుజిమంతి’ని (బిర్యాని) తినింది. అప్పటి నుంచి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూతురు బిర్యాణి తినడంతోనే మృతిచెందినట్లు ”ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్ణాటకలోని మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ విచారణకు ఆదేశించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్‌ సేప్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బాలికకు అందించిన చికిత్సను డీఎంహెచ్‌ఓ పరిశీలించాల్సిందిగా సూచించారు. ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురైన హోటల్‌ లైసెన్స్‌ను ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద రద్దు చేస్తామని మంత్రి తెలిపారు. వారం ప్రారంభంలో కొట్టాయం మెడికల్‌ కాలేజీలో ఒక నర్సు కోజికోడ్‌లోని ఒక తినుబండారం నుండి ఆహారం తిని మరణించినట్లు మరో ఆరోపణ కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement