గణేష్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 2, 4వ తేదీల్లో తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో బిర్యానీ, మాంసం దుకాణాలను మూసెయ్యాలని పోలీసులు ఆర్డర్ వేశారు. దేవాలయాల పట్టణం శివకంచిలోని అన్ని బిర్యానీ, మాంసం దుకాణాలను మూసివేయాలని కాంచీపురం పోలీసులు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. గణేశ్ విగ్రహాలతో ఊరేగింపు ఈ ప్రాంతం గుండా వెళుతుంది. కాంచీపురం B1 స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి ఈ ఆర్డర్ జారీ అయ్యింది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి 10 రోజుల పండుగగా.. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జరుపుకోనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement